మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతంలో నెలకొన్న తీవ్రమైన పరిస్థితిపై చర్చించడానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఉద్రిక్తతలు, పౌరుల ప్రాణనష్టం మరియు పౌర మౌలిక సదుపాయాలకు జరుగుతున్న నష్టం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ పౌరుల భద్రత మరియు రక్షణతో పాటు, వస్తువులు మరియు ఇంధనం ఎలాంటి అడ్డంకులు లేకుండా రవాణా కావడం భారతదేశం యొక్క ప్రధాన ప్రాధాన్యతలుగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. శాంతి మరియు స్థిరత్వం పట్ల భారతదేశ నిబద్ధతను పునరుద్ఘాటించారు మరియు చర్చలు, దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పినట్లు ప్రధాని ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.