ద హండ్రెడ్ లీగ్ క్రికెటర్ల ఆక్షన్ లో సన్ రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేయడం భారత్ లో విమర్శలకు దారితీసింది. సన్ రైజర్స్ లీడ్స్.. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ గ్రూప్ కు చెందినది కావడమే దీనికి ప్రధాన కారణం. దీనిపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తాజాగా స్పందించారు. ఈ అంశం బీసీసీఐ పరిధిలోకి రాదన్నారు. ఇతర దేశాల లీగ్ ల్లో ఫ్రాంఛైజీ నిర్ణయాల విషయంలో బోర్డు ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. మొన్న జరిగిన వేలంలో లీడ్స్ ఫ్రాంఛైజీ అబ్రార్ ను రూ.2.34 కోట్లకు కొనుగోలు చేసింది. అనంతరం సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ టీమ్ సోషల్ మీడియా ఎక్స్ ఖాతా తాత్కాలికంగా సస్పెండ్ అయింది. దీనిపై సన్ రైజర్స్ సీఈవో కావ్య మారన్ స్పందించలేదు.