ఐపీఎల్ లో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్..కేకేఆర్ కు ముజరబాని 

Spread the love

కోట్లాది క్రికెట్ ప్రేమికుల అభిమాన లీగ్ ఐపీఎల్ లో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెసింగ్ ముజరబాని ఆడనున్నాడు. కోల్ కతా  నైట్ రైడర్స్ అతడిని టీమ్ లోకి తీసుకుంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ నుండి  వైదొలగడంతో ముజరబానితో కేకేఆర్ ఒప్పందం చేసుకుంది. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ లో ముజరబాని తన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఈ మెగా టోర్నీలో 13 వికెట్లు తీశాడు. జింబాబ్వే టీమ్ సూపర్-8కు చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. 2025 ఐపీఎల్ చివర్లో  ముజరబాని ఆర్సీబీ జట్టులో చేరాడు. కానీ అతడికి ఫైనల్ టీమ్ లో అవకాశం రాలేదు. గత ఏడాది డిసెంబరులో జరిగిన ప్లేయర్స్ ఆక్షన్ లో  బంగ్లాదేశ్ కరైక్టర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ ను  రూ.9.20 కోట్లకు కేకేఆర్ కొనుక్కుంది. అయితే బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల నేపథ్యంలో ముస్తాఫిజుర్ ఎంపికపై విమర్శలు తలెత్తడంతో  బీసీసీఐ అతడిని జట్టు నుండి తప్పించాలని కేకేఆర్ ను  ఆదేశించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *