వరుస నష్టాల తర్వాత కోలుకుని నిన్న లాభాల బాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కూడా అదే దారిలో పయనించాయి. వరుసగా రెండో సెషన్ లోనూ లాభాలతో కళకళలాడాయి. నేటి ట్రేడింగ్లో తీవ్ర ఒడిదొడుకులకు లోనైనప్పటికీ చివరికి సూచీలు లాభాలతోనే ముగిశాయి. ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు మెటల్, ఆటో రంగ షేర్లు అండగా నిలవడంతో జోరు కనబరిచాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 568 పాయింట్లు లాభపడి 76,070 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 172.35 పాయింట్లు పెరిగి 23,581.15 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ. 92.41గా కొనసాగుతోంది. నిఫ్టీలో టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎటర్నల్ షేర్లు లాభాలతో ముగిశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు నష్టపోయాయి.