భారత పోస్టల్ శాఖ కీలక సేవలను ప్రారంభించింది. 3 చారిత్రాత్మక సేవలను ప్రారంభించడం ఈరోజు దేశం మొత్తానికి ఒక మైలురాయని కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్యా సింథియా పేర్కొన్నారు. 24 స్పీడ్ పోస్ట్, 48 స్పీడ్ పోస్ట్, 24 స్పీడ్ పోస్ట్ పార్శిల్. ఖచ్చితమైన డెలివరీ సమయాలు, రియల్-టైమ్ ట్రాకింగ్, మెరుగైన భద్రత మరియు ఆదివారం కూడా కార్యకలాపాలు కొనసాగించడం ద్వారా.. మన ఇండియా పోస్ట్ సరికొత్త వేగం, విశ్వసనీయత మరియు భారీ స్థాయి వృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఇది భారత్ యొక్క లాజిస్టిక్స్ మరియు ఇ-కామర్స్ రంగానికి మరింత శక్తిని ఇస్తుందని పేర్కొన్నారు. ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా గారితో కలిసి ప్రారంభంలో పాల్గొనడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. ఇండియా పోస్ట్ ఇప్పుడు కేవలం సేవలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్రతి వ్యాపారవేత్త, చిన్న వ్యాపారి మరియు ప్రతి పౌరుడికి వేగవంతమైన, విశ్వసనీయమైన మరియు అందుబాటులో ఉండే లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌గా రూపాంతరం చెందుతోందన్నారు. OTP ఆధారిత సురక్షిత డెలివరీ, రియల్-టైమ్ ట్రాకింగ్, BNPL సదుపాయం, మనీ-బ్యాక్ హామీ వంటి ఆధునిక సౌకర్యాలతో ఎక్స్‌ప్రెస్ సేవల్లో కొత్త ప్రమాణాలను స్థాపిస్తున్నట్లు వివరించారు.