‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ నాకు లభించడం,నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నా:మెగాస్టార్ చిరంజీవి 

Spread the love

ఉగాది సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను అందించింది. కాగా, ఈ పురస్కారాల్లో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ  పురస్కారం దక్కింది. సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఇక చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు…తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు.ఎన్టీఆర్ అంటే…N నాట్యం, T తాళం, R రాగం… కళల సమ్మేళనమని చిరంజీవి కొనియాడారు. తెలుగు సినిమాకు ఉన్న కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహానుభావుడు.

దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా…ఆయన పోషించిన పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభని పేర్కొన్నారు.  రామారావు గారు జన్మించిందే సినిమాల కోసం అన్నట్టుగా, ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిది. అలాంటి మహానుభావుని పేరుతో ఉన్న ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ నాకు లభించడం,నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *