శికంజ మాలిక్ వచ్చేసాడు.. The Paradise నుండి మరో ఆసక్తికర పోస్టర్

Spread the love

టాలీవుడ్‌లో ఎన్నో దశాబ్దాలుగా తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన లెజెండరీ నటుడు, ‘కలెక్షన్ కింగ్’గా పేరు పొందిన మంచు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక అదిరిపోయే సర్ప్రైజ్ అందింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం The Paradise నుంచి వచ్చిన ఈ స్పెషల్ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ‘శికంజా మాలిక్’ అనే పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించబోతున్నారు. మోహన్ బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ఇప్పటికీ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అలాంటి నటుడు ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్‌తో కనిపిస్తే ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సంగీతం విషయంలో కూడా ఈ సినిమా ప్రత్యేకంగా నిలవబోతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన ఇప్పటికే పలు సినిమాలకు ఇచ్చిన మ్యూజిక్ ఎలా ట్రెండ్ సెట్ చేసిందో తెలిసిందే. అందుకే ‘ది ప్యారడైజ్’ ఆల్బమ్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆయా షేర్ పాట ఐతే ఇప్పటికి యు ట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉంది. ఇప్పటికే టాలీవుడ్‌లో భారీ అంచనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. 2026 ఆగస్టు 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ఈ అప్‌డేట్ సినిమా మీద ఉన్న అంచనాలను మరింత పెంచింది. ఒక వైపు నాని, మరో వైపు మోహన్ బాబు — ఇద్దరూ తమ తమ స్టైల్లో నటిస్తే స్క్రీన్‌పై ఒక రేంజ్‌లో పోటీ కనిపించడం ఖాయం. దీనికి శ్రీకాంత్ ఓదెల కథ, అనిరుధ్ మ్యూజిక్ కలిస్తే ‘ది ప్యారడైజ్’ పై మరింత ఆసక్తిని పెంచేశాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *