2026-27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టబడింది. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ. 3,24,234 కోట్లతో దీనిని ప్రవేశపెట్టారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టడమే తమ ప్రభుత్వ టార్గెట్ అని స్పష్టం చేశారు. బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడీ కాదని ఇది ప్రజల జీవన స్థితిగతులను మార్చే ఒక ఆశయ పత్రమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతూ వాస్తవాల పునాదుల మీద ఈ బడ్జెట్ను రూపొందించినట్లు వివరించారు. గత ప్రభుత్వాల మాయమాటలకు భిన్నంగా పారదర్శకతతో కూడిన పాలనను అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక ఒత్తిడులు ఉన్నప్పటికీ రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి, నాణ్యమైన విద్య మరియు ఆరోగ్య రంగాలకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేసినట్లు పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. మేము పాలకులం కాదు, ప్రజల సేవకులం అనే భావనతో ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలు చెల్లించే ప్రతి పైసాకు కాపలాదారులుగా ఉంటూ, వారి అభ్యున్నతి కోసమే ఈ బడ్జెట్ను అత్యంత చిత్తశుద్ధితో రూపొందించామన్నారు.
మొత్తం బడ్జెట్ – రూ.3,24,234 కోట్లు
రెవెన్యూ వ్యయం – రూ.2,34,406 కోట్లు
మూలధన వ్యయం – రూ.47,267 కోట్లు
ద్రవ్యలోటు – రూ.58,458 కోట్లు
తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లు
రైతు సంక్షేమం – రూ.23,179 కోట్లు
విద్యుత్ – రూ.21,285 కోట్లు
విద్యా శాఖ – రూ.26,674 కోట్లు
చేనేత – రూ.258 కోట్లు
పశుసంవర్ధక శాఖ – రూ.1,529 కోట్లు
ఇరిగేషన్ ప్రాజెక్టులు – రూ.22,615 కోట్లు
రవాణా శాఖ – రూ.12,759 కోట్లు
పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ – రూ.17,907కోట్లు
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి – రూ.33,688 కోట్లు
వైద్యం – రూ.13,679 కోట్లు
కార్మికుల సంక్షేమం – రూ.999 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.11,784 కోట్లు
మైనారిటీ సంక్షేమం – రూ.3,769 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ.7,937కోట్లు
బీసీ సంక్షేమం – రూ.12,511 కోట్లు
మహిళా శిశు సంక్షేమం – రూ.3,143 కోట్లు
న్యాయ శాఖ – రూ.2,367 కోట్లు
రాజీవ్ యువ వికాసం – రూ.6వేల కోట్లు
సివిల్ సప్లయ్ – రూ.7,366 కోట్లు
పరిశ్రమలు – రూ.3,490 కోట్లు
గృహ నిర్మాణం – రూ.7,430 కోట్లు
ఐటీ సెక్టార్ – రూ.875 కోట్లు.