ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికుల నోట ఒక్క మాటే వినిపిస్తోంది అదే ‘ధురంధర్ 2’. థియేటర్ల వద్ద మొదటి రోజు నుంచే కనిపిస్తున్న హౌస్‌ఫుల్ బోర్డులు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్స్, అభిమానుల ఉత్సాహం… ఇవి అన్నీ కలిపి ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చెప్పకనే చెబుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, దర్శకుడు ఆదిత్య ధార్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్. భారీ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ‘దురంధర్’ మొదటి భాగం ‘దురంధర్’ పార్ట్-1 బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ఒకే భాషలో విడుదలై కూడా 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడం నిజంగా ఒక రికార్డు. ఇది బాలీవుడ్ చరిత్రలో అరుదైన ఘనతగా నిలిచింది. ఈ విజయంతోనే సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రేక్షకులు ఈ కథ ఎటు దిశగా వెళ్లబోతోందో తెలుసుకోవాలనే ఆసక్తితో ఎదురుచూశారు. ఈ అంచనాల మధ్య విడుదలైన సీక్వెల్ ధురంధర్: ది రివేంజ్ ఇప్పుడు అదే జోష్‌తో ముందుకు దూసుకుపోతోంది. మొదటి షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, అభిమానుల నుంచి వస్తున్న స్పందన అన్ని అద్భుతం. ఈసారి కథ మరింత వేగంగా, మరింత ఉత్కంఠభరితంగా సాగుతుందని చెప్పబడుతోంది. మొదటి భాగంలో చూపించిన పాత్రల ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఈసారి రివెంజ్ ఎలిమెంట్‌ను బలంగా చూపించారు.
ఈ సినిమాలో రన్వీర్ సింగ్ పాత్ర మరింత గంభీరంగా, లోతుగా రూపుదిద్దుకుంది. గత భాగంలో అతను ఎదుర్కొన్న సంఘటనలు, వ్యక్తిగత నష్టాలు, అన్నిటికి ఒక సమాధానం దొరుకుతుంది. అతని పాత్రలో కనిపించే ఎమోషనల్ డెప్త్, యాక్షన్ సన్నివేశాల్లో చూపించిన ఉత్సాహం ప్రేక్షకులను పూర్తిగా సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు ఆదిత్య ధర్ ఈసారి కథను మరింత విస్తృతంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. విజువల్స్, యాక్షన్ కొరియోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్. ప్రతి సీన్లోనూ ఒక హాలీవుడ్ స్థాయి ఫీల్ కనిపిస్తోందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సినిమా టెక్నికల్‌గా కూడా చాలా బలంగా ఉందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి, ‘దురంధర్ 2’ ఇప్పుడు ఒక సినిమా మాత్రమే కాదు, ఒక ఫెనామెనన్గా మారింది. మొదటి భాగం సృష్టించిన మ్యాజిక్‌ను ఈ సీక్వెల్ కొనసాగిస్తుందా అనే ప్రశ్నకు సమాధానం దాదాపు లభించినట్టే కనిపిస్తోంది. రణ్ వీర్ సింగ్ కెరీర్లో ఇది మరో మైలురాయిగా నిలిచే అవకాశముంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది—ప్రస్తుతం ఇండస్ట్రీలో ‘దురంధర్ 2’ హవా కొనసాగుతోంది. అభిమానుల అంచనాలను అందుకుంటూ, బాక్సాఫీస్ వద్ద గర్జిస్తూ ముందుకు సాగుతోంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే, మరోసారి 1800 కోట్ల మార్క్ దాటడం కూడా అసాధ్యం కాదు.