మరోసారి తెరపైకి రజిని శోభన క్రేజీ కాంబినేషన్? 

Spread the love

దశాబ్దాలుగా ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు మన సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయనతో కొంత మంది హీరోయిన్స్ చేసిన పాత్రలు అలా ప్రత్యేకంగా నిలిచిపోయాయి. అందులో భాగంగానే ఒకప్పుడు సంచలన విజయాన్ని అందుకున్న నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రతో అద్భుతమైన ప్రతిభ చూపించిన రమ్యకృష్ణ మళ్లీ రజనీకాంత్‌తో కలిసి నటించనున్నారన్న వార్త అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. నరసింహా తర్వాత ఈ జోడీ జైలర్ సినిమాలో రజనీకాంత్, రమ్యకృష్ణ భార్యాభర్తలుగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఈ సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తెరకెక్కుతున్న జైలర్ సీక్వెల్‌లో కూడా ఈ జోడీ కొనసాగనుందని సమాచారం. దీంతో ఈ కాంబినేషన్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఇక జైలర్ 2 తర్వాత రజనీకాంత్ మరో భారీ ప్రాజెక్ట్‌తో బిజీ కానున్నారు. ప్రస్తుతం తలైవా 173 చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ పాత్ర కోసం సీనియర్ నటి శోభన  పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. గతంలో వీరిద్దరూ కలిసి దళపతి వంటి సినిమాల్లో నటించారు. ముఖ్యంగా దళపతి సినిమాలో వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమకథ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ కాంబినేషన్ తిరిగి వస్తే  ఇప్పుడు మళ్లీ దాదాపు 35 ఏళ్ల తర్వాత ఈ జంట మళ్లీ తెరపై కనిపించినట్లవుతుంది. ఇది ఖచ్చితంగా అభిమానులకు ఒక పెద్ద ట్రీట్ అవుతుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *