ధురంధర్ సినిమాపై భారీ చిత్రాల దర్శకుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. “నాకు ధురంధర్-1 బాగా నచ్చింది. , కానీ ‘ది రివెంజ్’ దానికంటే మిన్నగా ఉంది. స్కేల్ పరంగానే కాకుండా, సినిమాలో ఉన్న ఎమోషన్ గుండెలకు హత్తుకుందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. రచన, నటీనటుల ఎంపిక, సాంకేతిక విలువలు, సంగీతం, వరల్డ్ డిజైన్ మరియు దర్శకత్వం… అన్నీ అద్భుతమని కొనియాడారు. ముఖ్యంగా ఆ ఎమోషనల్ సీన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కథలో వచ్చే ట్విస్ట్లు ఉత్కంఠను రేకెత్తించడమే కాకుండా, మనల్ని ఎమోషనల్గా కనెక్ట్ చేస్తాయి. ఆదిత్య ధార్ , మీరు అసాధారణమైన విజయాన్ని అందుకున్నారు. 4 గంటల నిడివి గల సినిమాను తీసి, విడుదల చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ప్రేక్షకులు చివరి ఫ్రేమ్ వరకు సీట్లకు అతుక్కుపోయేలా చేయడంలో మీరు సఫలమయ్యారని ప్రశంసించారు. రణ్ వీర్ సింగ్ నటన అద్భుతమని కొనియాడారు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు, హమ్జా మరియు జస్కిరాత్ పాత్రల్లో మీరు మమ్మల్ని మంత్రముగ్ధులను చేశారు. ఇక యాక్టర్ మాధవన్ నటనపైనా రాజమౌళి ప్రశంసలు కురిపించారు. ఇంతటి ఈ భారీ విజయాన్ని అందుకున్న చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.