గత రంజాన్ సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన షేక్ షహెన్షా కుటుంబానికి కొత్త ఇంటిని నిర్మించి ఇవ్వడం ఆనందంగా ఉందని పేద కుటుంబానికి అండగా నిలబడటం తన బాధ్యతగా భావిస్తున్నానట్లు లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆ ఇంటి తాలూకు కుటుంబసభ్యుల వీడియోను లోకేష్ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా పంచుకున్నారు. లోకేష్ చేసిన పనికి సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సేవకుడే నాయకుడైన వేళ అంటే ఇదే మరి ఇప్పటివరకు పుస్తకాల్లో చదువుకున్నాం. ఇప్పుడు వాస్తవంగా చూస్తున్నాం ఇదే కదా రాష్ట్రం కోరుకుంటున్నా ది ప్రజల్లో ఒక్కరిగా ప్రజల కోసం ఒక్కడిగా నాయకుడు మన లోకేష్ అని చెప్పడానికి సంతోషపడుతున్నాం. ప్రతి ఒక్కరూ ఇలాగే పనిచేసే ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనాలని తమ స్పందన తెలియజేస్తున్నారు.