అతిపిన్న వయసులో సెంచరీ..రువాండా ప్లేయర్ ఫ్యానీ సరికొత్త రికార్డు

Spread the love

ఇంటర్నేషనల్  టీ20ల్లో అతిపిన్న వయసులోనే సెంచరీ  చేసిన క్రికెటర్‌ గా రువాండా బ్యాటర్‌ ఫ్యానీ ఉటగుషిమనిండే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఘనాతో జరిగిన మ్యాచ్‌లో ఫ్యానీ సెంచరీతో (65 బంతుల్లో 111నాటౌట్) చేసింది. 15 ఏళ్ల 223 రోజుల్లో ఆమె ఈఅరుదైన రికార్డు నెలకొల్పింది. అంతకుముందు ఈ రికార్డ్‌ ఉగాండా ప్లేయర్‌ ప్రోస్కోవియా అలకో (16 ఏళ్ల 233 రోజులు) పేరు మీద ఉంది. ఫ్యానీకి ఇదే మొదటి  ఇంటర్నేషనల్‌ టీ20 మ్యాచ్‌ కావడం విశేషం.

క్రికెట్ ప్రపంచంలో అతి పిన్న వయసులోనే సెంచరీ బాదిన ఆ బ్యాటర్ ప్రదర్శన అమోఘం. ప్రతిభ ఉంటే వయసుతో సంబంధం లేదని ఈ సెంచరీతో నిరూపించింది.  క్రికెట్ విశ్లేషకులు సైతం నోరెళ్లబెట్టేలా, ఈ ఇన్నింగ్స్ ఒక క్లాసిక్ మాస్టర్‌పీస్‌గా నిలిచిపోయింది. ఆ సెంచరీ కేవలం ఒక వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు, రాబోయే తరాలకు ఒక గొప్ప స్ఫూర్తి. ఈ సెంచరీ ఈ ఫార్మాట్‌ లో ఫ్యానీని గ్లోబల్ స్టార్‌గా మార్చేసింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *