ఆదంపుర్‌ ఎయిర్‌ బేస్‌ అంటే పాకిస్థాన్కు ఎందుకు బయం..?

Spread the love

పాకిస్థానతో ఉద్రిక్తతల సమయంలో తాము దాడి చేసి.. పాకిస్థాన్ లోని ఎయిర్ బేస్ లను నాశనం చేశామని చెప్పింది.. అయితే ఇది ఎంత వరకు నిజం.. అంటే ఆన్సర్ జీరో. ఎందుకంటే భారత్ లోని ఒక్క ఎయిర్ బేస్ ను టచ్ చేయలోకపోయింది. వారి ప్రజలను మభ్యపెట్టడానికి పాకిస్థాన్ ఇలా అబద్ధాలు చెబుతోంది. ముఖ్యంగా అదంపుర్ ఎయిర్ బేస్ పై తప్పుడు ప్రచారానికి అద్దే లేదు. ఇక్కడ ఉన్న ఎస్ -400 పై తాము దాడి చేసామని పాక్ కాకమ్మ కథలు చెబుతోంది. అయితే అదంపుర్ పై ఎందుకు పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది..? ఈ బేస్ కు ఉన్న ప్రాముఖ్యత ఏంటి..? భారత్ ముఖ్యమైన ఎయిర్ బేస్ లు ఏంటి..? ఇవి ఎందుకు వ్యూహాత్మకం..?

భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్ .. తన ప్రజలకు మాత్రం అబద్ధాలు వండి వారుస్తోంది. భారత్ ఫైటర్ జెట్లను కూల్చేశామని .. భారత ఎయిర్ బేస్ లను నాశనం చేశామని చెబుతోంది. అయితే ఆధారాలు మాత్రం లేవంటోంది. భారత్ పాకిస్థాన్ సైనిక స్థావరాలపై దాడులకు సంబంధించి శాటిలైట్ చిత్రలను చూపిస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం మాటలతో కోటలు కట్టేస్తోంది. ఇది నమ్ముతున్న అక్కడి ప్రజలు నిజమే అనుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పాక్‌ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలోని నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌ను భారత్‌ దిమ్మతిరేగే దెబ్బకొట్టింది. దీనికి ప్రతిగా భారత్‌లోని ఆదంపుర్‌ ఎయిర్‌ బేస్‌పై దాడి చేసి ఎస్‌-400పై దాడి చేశామంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది పాకిస్థాన్. దీనిని తిప్పికొట్టేలా ఇటీవల ప్రధాని మోదీ స్వయంగా ఆదంపుర్‌ను సందర్శించి.. ఎస్‌-400, మిగ్‌-29లు సురక్షితమే అని ప్రపంచానికి చూపారు. వ్యూహాత్మకంగా ఆదంపుర్‌ వైమానిక స్థావరానికి చాలా ప్రాధాన్యం ఉంది. భారత్‌-పాక్‌ మధ్య జరిగిన ప్రతీ యుద్ధంలో ఇది శత్రుదేశానికి తొలి లక్ష్యంగా మారినా.. దాడులకు తట్టుకొని గంభీరంగా నిలిచింది. ఆదంపుర్‌ వాయుసేన స్థావరాన్ని 1950ల్లో ఏర్పాటుచేశారు. ఇది పంజాబ్‌లోని జలంధర్‌ నగరానికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఇక్కడి నుంచి పాకిస్థాన్‌ కేవలం 100 కిలోమీటర్ల దూరం. దేశంలోని రెండో అతిపెద్ద వైమానిక స్థావరం. ఇది 75 ఏళ్లుగా పాక్‌ రాడార్‌ గురిలో ఉన్నా.. చెక్కుచెదరని ఉక్కుశిల్పంలా నిలిచింది. పాక్‌ ఎప్పుడూ దీని భద్రతా వ్యవస్థలోకి చొరబడాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈనెల 9-10 తేదీల్లో పాక్‌ దాదాపు 6 క్షిపణులను ప్రయోగించగా.. మొత్తాన్ని దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలోనే భారత్‌ కూల్చేసింది.

అదంపుర్ స్థావరం వాయుసేనకు చెందిన 47వ స్క్వాడ్రన్‌కు అడ్డా. దీనిని బ్లాక్‌ ఆర్చర్స్ అని కూడా పిలుస్తుంటారు. దీంతోపాటు ఫస్ట్‌ సూపర్‌సోనిక్స్‌ గా పేరున్న 28వ స్క్వాడ్రన్‌ ఇక్కడే ఉంటుంది. ఈ స్థావరం రోజువారీ కార్యకలాపాలకు ఈ రెండు అత్యంత కీలకమైనవి. వ్యూహాత్మకంగా ఆదంపుర్‌ కీలక స్థానం. దీని చుట్టుపక్కల దాదాపు 150 కిలోమీటర్ల లోపే.. ఆపాచీ హెలికాప్టర్లు ఉన్న పఠాన్‌కోట్‌, సుఖోయ్‌-30 ఎంకేఐలు ఉన్న హల్వార, పాక్‌ సరిహద్దుల్లోని అమృత్‌సర్‌, రఫేల్స్‌ కేంద్రమైన బఠిండా, ఛండీఘడ్‌ వాయుసేన స్థావరాలున్నాయి. వీటన్నింటిని గ్రిడ్‌ వలే కలుపుతూ ఆదంపుర్‌ ఎయిర్‌బేస్‌ ఉంది. ఈనేపథ్యంలో ఎస్‌-400 గగనతల రక్షణవ్యవస్థ తొలి రెజిమెంట్‌ను ఇక్కడే మోహరించారు. దీంతో పశ్చిమ సరిహద్దులు దీని రక్షణ ఛత్రం కిందకు వచ్చాయి. 1965లో పాక్‌ వాయుసేన ఆదంపుర్‌పై ముందస్తు దాడి చేసింది. ఆ తర్వాత 135 స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌ పారా కమాండోలను ఇక్కడ ఎయిర్‌ డ్రాప్‌ చేసింది. కానీ, భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆ కమాండోల్లో చాలామందిని పట్టుకొని మన దళాలకు అప్పగించారు. మిగిలిన కమాండోలు పాకిస్థాన్‌కు పారిపోయారు. అప్పట్లో ఈ ఎయిర్‌బేస్‌లో వాయుసేన 1వ స్క్వాడ్రన్‌ ఉండేది. అది సర్గోదా సహా ఇతర కీలక పాక్‌ వాయుసేన స్థావరాలను ధ్వంసం చేసింది. ఇక 1971 యుద్ధ సమయంలో పఠాన్‌కోట్‌లోని రన్‌వేను పాక్‌ ధ్వంసం చేయగా.. ఆదంపుర్‌ నుంచి యుద్ధవిమానాలు గాల్లోకి ఎగిరి.. ఆ ఎయిర్‌బేస్‌కు రక్షణ కల్పించాయి. ఈ యుద్ధం మొత్తంలో పూర్తి శక్తి సామర్థ్యాలతో ఇది పనిచేస్తుంది. ఇక 1999 కార్గిల్‌ యుద్ధంలో ఇక్కడినుంచి మిరాజ్ 2000 విమానాలు బయల్దేరి శత్రుబంకర్లను ధ్వంసం చేశాయి. టైగర్‌ హిల్స్‌, టోలోలింగ్‌ శిఖరాల స్వాధీనంలో కీలక పాత్ర పోషించింది.

ఆదంపుర్‌ ఎయిర్‌ బేస్‌ తో పాటు భారత్ లో ఇంకా చాలా కీలకమైన ఎయిర్ బేస్ లు ఉన్నాయి. హిందన్ ఎయిర్‌బేస్ భారత ఎయిర్ ఫోర్స్‌లో అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన బేస్‌లలో ఒకటి. ఢిల్లీ సమీపంలో ఉన్న ఈ బేస్ ఉత్తర భారత రక్షణలో వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుంది. సుఖోయ్ Su-30 MKI ఫైటర్ జెట్లు, C-17 గ్లోబ్‌మాస్టర్, ఇల్యూషిన్-76 రవాణా విమానాలు ఇక్కడి నుంచే పనిచేస్తుంటాయి. ఇక రెండోవది
అంబాలా ఎయిర్‌బేస్. భారత ఎయిర్ ఫోర్స్‌లో ప్రధాన ఫైటర్ బేస్‌లలో ఒకటి, రాఫెల్ జెట్లకు ప్రధాన కేంద్రం. 2020 నుంచి రాఫెల్ జెట్లు ఇక్కడ ఇండక్ట్ చేయబడ్డాయి. మీటియోర్, బ్రహ్మోస్ క్షిపణులతో సన్నద్ధమై ఉంది. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ బేస్ ఆపరేషన్ సిందూర్ లో కీలక పాత్ర పోషించింది. సుఖోయ్ Su-30 MKI, మిగ్-21 జెట్లు ఇక్కడ ఉంటాయి. ఎయిర్ సుపీరియారిటీ మిషన్లకు ఉపయోగపడతాయి. ఈ బేస్ ఆకాశ్, బరాక్-8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లతో రక్షించబడుతుంది. అంబాలా శత్రు దాడులను త్వరితంగా ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉంది. ఈ బేస్ ఉత్తర భారత రక్షణలో వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. శిక్షణ, లాజిస్టిక్స్ సపోర్ట్ కోసం ఈ బేస్ కేంద్రంగా ఉంటుంది.

ఇక మూడవది పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న వ్యూహాత్మక బేస్. మిగ్-21, సుఖోయ్ Su-30 MKI ఫైటర్ జెట్లు, మిల్ Mi-17 హెలికాప్టర్లు ఇక్కడ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. 2025 ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ డ్రోన్ దాడులను S-400 సిస్టమ్‌లు ఇక్కడ నిరోధించాయి. ఈ బేస్ ఎయిర్ స్ట్రైక్, రక్షణ ఆపరేషన్లకు కీలకమైన స్థానం. జమ్మూ కాశ్మీర్ రక్షణలో పఠాన్‌కోట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు ఈ బేస్‌ను రక్షిస్తాయి, శత్రు దాడులను అడ్డుకుంటాయి. ఈ బేస్ శిక్షణ, గూఢచర్య సమాచార సేకరణకు సామర్థ్యం కలిగి ఉంది. పఠాన్‌కోట్ సరిహద్దు రక్షణలో వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఒక నాలుగవది జోధ్‌పూర్ ఎయిర్‌బేస్. పశ్చిమ భారతంలో వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా పనిచేస్తుంది. సుఖోయ్ Su-30 MKI, మిగ్-27, మిగ్-21 ఫైటర్ జెట్లు ఇక్కడ ఉంటాయి. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ బేస్ ఎయిర్ స్ట్రైక్, రక్షణ ఆపరేషన్లకు ఉపయోగపడుతుంది. ఆపరేషన్ సిందూర్ లో ఈ బేస్ నుంచి జెట్లు పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నాయి. ఆకాశ్, స్పైడర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు ఈ బేస్‌ను రక్షిస్తాయి. జోధ్‌పూర్ శిక్షణ, లాజిస్టిక్స్ సపోర్ట్ కోసం కీలక కేంద్రంగా ఉంది. ఈ బేస్ రాజస్థాన్ రక్షణలో, పాకిస్తాన్ దాడులను ఎదుర్కోవడంలో ముఖ్యమైనది.