భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా సేవలందించిన వ్యక్తిగా 8,931 రోజులు పూర్తి చేసుకుని, చారిత్రాత్మక మైలురాయిని అధిగమించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు. ఈ అసాధారణ విజయం దేశం పట్ల ఆయనకున్న అంకితభావానికి, దూరదృష్టి గల నాయకత్వానికి మరియు దేశ ప్రగతి, శ్రేయస్సు కోసం ఆయన చేస్తున్న అవిశ్రాంత కృషికి నిదర్శనమని సీఎం చంద్రబాబు ఈమేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ను నిర్మించాలనే ఆయన సంకల్పం మనందరికీ స్ఫూర్తినిస్తూ, భారతదేశాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపిస్తోందని పేర్కొన్నారు. దేశాన్ని మరిన్ని ఉన్నత శిఖరాలకు చేర్చే క్రమంలో ఆయనకు ఆయురారోగ్యాలు, శక్తి సామర్థ్యాలు మరియు మరిన్ని విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు.