న్యూజిలాండ్ ఉమెన్స్ క్రికెటర్ అమేలియా కెర్ వరల్డ్ రికార్డుతో సత్తా చాటింది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో వరుసగా 10 ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో 30 పైచిలుకు స్కోర్లను సాధించిన క్రికెటర్ గా అరుదైన ఘనతను సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. గత 10 మ్యాచ్ లలో ఆమె 554 పరుగులు చేసింది. అలాగే బౌలర్ గానూ ఈ పది మ్యాచ్ లలో 12 వికెట్లు కూడా పడగొట్టింది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన టీ 20 మ్యాచ్ లో 29 బాల్స్ లో 31 పరుగులు చేసిన కెర్ బౌలింగ్ లో కూడా 1 వికెట్ తీసి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. దీంతో 5 టీ 20 మ్యాచ్ ల సిరీస్ లో న్యూజిలాండ్ 3-1 ఆధిక్యంలోకి వెళ్లింది. 2024లో సౌతాఫ్రికాపై (43;38బాల్స్ లో), 2025లో ఆస్ట్రేలియా సిరీస్ లో 51(46), 40(36), 66 (47), 2026లో జింబాబ్వేపై 82(52), 2026లో సౌతాఫ్రికాపై 78(44), 32 (18), 30(28), 31(29) పరుగులు చేసింది.