ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో కీలక అడుగు…ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ కు శంకుస్థాపన

Spread the love

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. ఉక్కు రంగంలో రాష్ట్రానికి అతి పెద్ద పెట్టుబడి అయిన  రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నేడు భూమి పూజ కార్యక్రమం జరిగింది.అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్  ఇండియా ప్లాంట్‌ కు భూమి పూజ చేశారు. కేంద్ర మంత్రులతో కలిసి ప్లాంటుకు సీఎం చంద్రబాబు  శంకుస్థాపన చేశారు. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం  లక్ష మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఏఎంఎన్ఎస్ ఇండియా రాకతో పరిశ్రమల హబ్‌గా విశాఖ ఎకనమిక్ రీజియన్ మారనుంది. నేడు శంకుస్థాపన కార్యక్రమానికి ప్రభుత్వ ప్రముఖులు – ఉక్కు సంస్థల ప్రతినిధులు తరలివచ్చారు. కేంద్ర మంత్రులతో కలిసి శంకుస్థాపన ఫలకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. భూమిపూజకు ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ నారాయణ మిట్టల్, ఏఎంఎన్ఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్, నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రతినిధులు హాజరయ్యారు. ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం, AM-NS మినియేచర్ నమూనా స్టీల్ ప్లాంట్‌ ను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు వీక్షించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *