ఐపీఎల్…కేకేఆర్ వైస్ కెప్టెన్ గా స్టార్ హిట్టర్ రింకూ సింగ్

Spread the love

ఐపీఎల్ కు ఇక కేవలం మూడు రోజులే ఉంది. ఈ నేపథ్యంలో టీమ్ లన్నీ రెడీ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం క్రికెట్ అభిమానులను అలరించేందుకు ముందుకొచ్చే మెగా ఐపీఎల్ టోర్నీ ఈ నెల 28నుండి ప్రారంభం కానుంది. ప్లేయర్స్ అంతా ప్రాక్టీసు చేస్తూ ప్రిపేర్  అవుతున్నారు. సరికొత్త వ్యూహాలతో టీమ్ మానేజ్మెంట్లు సిద్ధమవుతున్నాయి. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ కు వైస్ కెప్టెన్ గా రింకూ సింగ్ వ్యవహరించనున్నాడు. ‘దేవుని ప్రణాళికలో ఒక కొత్త అధ్యాయం’ అంటూ కే.కే.ఆర్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది. 2018 నుండి రింకూ సింగ్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో కెప్టెన్ గా వ్యవహరించిన ఎక్స్పీరియన్స్ అతడికి ఉంది. ఇక ఈ సీజన్ లో కేకేఆర్ టీమ్ తన మొదటి మ్యాచ్ లో ముంబైతో ఈ నెల 19న తలపడనుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *