కోల్ కతా నైట్ రైడర్స్ ఈ సీజన్ ఐపీఎల్ కు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు తమ టీమ్ కీలక ప్లేయర్స్ లో ఒకడిగా కొనసాగిన వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ ఆండ్రూ రస్సెల్ గౌరవార్థం అతని జెర్సీ నెంబర్ 12కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ మేరకు నిన్న సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో ఆ టీమ్ ఈ విషయాన్ని తెలిపింది. ఆండ్రూ రస్సెల్ తో తమకు ఎంతో అనుబంధం ఉందని గ్రౌండ్ లో తన ఆటతీరుతో తమను సెలబ్రేషన్స్ చేసుకునేలా చేశారు. జెర్సీ నెంబర్ 12ను అతనెప్పుడూ గర్వంగా ధరించాడు. ఆ నెంబర్ తనకెంతో ప్రత్యేకమని అతని గౌరవార్థం ఆ జెర్సీ నెంబర్ ను రిటైర్ చేయాలనుకుంటున్నట్లు ఆ టీమ్ సీఈవో వెంకీ మైసూర్ తెలిపారు. ఇన్నేళ్లుగా టీమ్ తో కలిసి ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించాం. రెండు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన టీమ్ లో భాగమవడం అద్భుతమైన అనుభూతి అని రస్సెల్ పేర్కొన్నాడు. ఈ జర్నీని ఇంత ప్రత్యేకంగా చేసిన కేకేఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.