ఆందోళన వద్దు…సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి

Spread the love

తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ అంశంపై ప్రజలు అపోహలు నమ్మొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వదంతులతో పెట్రోల్, డీజిల్ ఎక్కువగా కొనడం వలెనే బంకుల వద్ద రద్దీ కనిపిస్తుందన్నారు. క్యాన్లు, కంటైనర్లలో ఫ్యూయల్ తీసుకెళ్లడం చట్టవిరుద్ధమని అలా చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో సరిపడా నిల్వలు ఉన్నట్లు స్పష్టం చేశారు. ట్యాంకర్లు సకాలంలో రానందువలనే నో స్టాక్ బోర్డులని స్పష్టం చేశారు.  గ్యాస్ సరఫరాకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. హాస్టల్స్, హాస్పిటల్స్ కు గ్యాస్ సరఫరాను మానిటర్ చేస్తున్నట్లు తెలిపారు. కమర్షియల్ సిలిండర్ల విషయంపై కేంద్రంతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. అసెంబ్లీ వద్ద మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ ఈమేరకు పేర్కొన్నారు. ఇక తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం  ఇంధన కొరత ఏమీ లేదు, HPCL, IOCL మరియు BPCL సంస్థల వద్ద సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి మరియు సరఫరా వ్యవస్థలు సాధారణంగానే పనిచేస్తున్నాయని ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెస్ నోట్ ను తన పోస్ట్ కు జోడించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *