అత్యాధునిక ‘డయాగ్రిడ్’ సాంకేతికతతో రెడీ అవుతున్న అమరావతి ఐకానిక్ టవర్స్

Spread the love

అమరావతి నగరం ఒక నిర్దిష్టమైన ఆశయం మరియు దార్శనికతతో సాకారం అవుతోందని మంత్రి నారాయణ అన్నారు. అన్ని రాష్ట్ర స్థాయి ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటికి చేర్చేలా రూపొందించిన ఐదు ఐకానిక్ టవర్లలో ఒకటైన హెచ్ఓడి (HOD) టవర్-3 కార్నర్ నోడ్ ఇన్‌స్టాలేషన్ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈరోజు హెచ్‌ఓడీ టవర్-3 వద్ద ‘కార్నర్ నోడ్’ అమర్చే పనులను మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ టవర్లను అత్యాధునిక ‘డయాగ్రిడ్’ సాంకేతికతతో నిర్మిస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ఒక విశిష్టమైన ఆర్థిక నమూనా ఆధారంగా అమరావతి స్వయం సమృద్ధి గల నగరంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.  అలాగే, అమరావతిలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం  సమీక్ష నిర్వహించారుని రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *