మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలకల క్వారీ దగ్గర హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు టిప్పర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమై, 10 మందికి పైగా సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. జగిత్యాల నుంచి వింజమూరు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రాయవరం గ్రామం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ను ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అయితే బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు మరి కొందరికి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కొందరిని బస్సు నుండి బయటకు తీసే తీయగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే కొందరికి తీవ్ర గాయాలు కావటం తో మృతుల పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.