రామ్ చరణ్ కంటికి సర్జరీ..డాక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్ చిరు

Spread the love

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ లో గాయపడ్డారనే వార్తకు సంబంధించి మూవీ టీమ్ ఇప్పటికే స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. చరణ్ కు బాగానే ఉందని ఆయన త్వరలో షూటింగ్ లో పాల్గొంటారని తెలిపింది. కాగా, రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కు సర్జరీ జరిగిన విషయాన్ని ఆ సర్జరీ చేసిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్ కు కృతఙ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.  డాక్టర్ సుధాకర్ ప్రసాద్ గారికి, చరణ్ సర్జరీని మీరు ఎంతో నైపుణ్యంతో, విజయవంతంగా పూర్తి చేసినందుకు ధన్యవాదాలు. ఆందోళనలో ఉన్న మాకు మీ చికిత్స ఒక భరోసానిచ్చింది. మీ సేవా దృక్పథానికి, ప్రతిభకు మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటాము అని చిరు పేర్కొన్నారు. ఇక రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో ఆకాంక్షిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇక పెద్ది  సినిమాను యువ దర్శకుడు బుచ్చిబాబు సాన  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు, బాలీవుడ్ నటుడు తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో వేగంగా కొనసాగుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *