భారత్ సిరీస్ ల షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ

Spread the love

భారత్ 2026-27 సీజన్ లో స్వదేశంలో జరిగే సిరీస్ ల షెడ్యూల్ ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఇక ఈ సీజన్ లో వెస్టిండీస్, శ్రీలంక,జింబాబ్వే, ఆస్ట్రేలియా టీమ్ లు భారత్ లో పర్యటించనున్నాయి. ఇందులో 17 నగరాల్లో 22 మ్యాచ్ లు ఆడబోతోంది. ముందుగా వెస్టిండీస్ తో మూడు వన్డేలు, ఐదు టీ 20 మ్యాచ్ లు జరగనున్నాయి. సెప్టెంబర్ 27న  త్రివేండ్రం వేదికగా మొదటి వన్డే, సెప్టెంబర్ 30న గువాహటి లో రెండో వన్డే, అక్టోబర్ 3న న్యూ చండీఘర్ లో మూడో వన్డే జరగనుంది. ఇక ఐదు టీ 20 లు అక్టోబర్ 6,9,11,14,17న టీ 20 మ్యాచ్ లు లక్నో, రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులలో జరగనున్నాయి. ఇక శ్రీలంకతో డిసెంబర్ 13,16,19 తేదీలలో ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ లలో వన్డేలు, 22, 24, 27 తేదీలలో రాజ్ కోట్, కటక్, పుణేలలో టీ 20లు జరగనున్నాయి. జింబాబ్వే తో 2027 జనవరి 3,6,9న కోల్ కతా, హైదరాబాద్, ముంబైలలో వన్డేలు జరగనున్నాయి. ఇక జనవరి 21 నుండి ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. జనవరి 21-25వరకు నాగ్ పూర్ లో మొదటి టెస్టు, జనవరి  29-ఫిబ్రవరి 2 వరకు రెండో టెస్టు చెన్నై, ఫిబ్రవరి 11-15 వరకు గువాహటి వేదికగా మూడో టెస్టు, ఫిబ్రవరి 19-23వరకు రాంచీలో నాలుగో టెస్టు, ఫిబ్రవరి 27-మార్చి 3 వరకు అహ్మదాబాద్ లో ఐదో టెస్టు జరగనుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *