సమ్మర్ సీజన్ వచ్చిందంటే భారత్ లో క్రికెట్ మెగా లీగ్ సందడి మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లందరూ ఒకే వేదికపైకి వచ్చి, తమ ప్రతిభను ప్రదర్శించే అత్యున్నత క్రికెట్ లీగ్ ఐపీఎల్. ప్రతి సాయంత్రం స్టేడియంలన్నీ అభిమానుల కేరింతలతో, వాళ్ల వాళ్ల టీమ్ లను సపోర్ట్ చేస్తూ సందడి చేస్తుంటారు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠను రేకెత్తించే మ్యాచ్‌లు, యువ ఆటగాళ్లకు లభించే గొప్ప అవకాశాలుఐపీఎల్ ని ప్రపంచంలోనే నంబర్ వన్ లీగ్‌గా నిలబెట్టాయి. ఈ సీజన్ ఐపీఎల్ రేపటి నుండి ప్రారంభమవుతోంది. మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఇక ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ను ప్రకటించింది.