అదరగొడుతున్న పెద్ది పహిల్వాన్…చరణ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు సూపర్ గిఫ్ట్

Spread the love

నేడు మెగాపవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే బహుమతిని ఆయన నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుండి మూవీ టీమ్ అందించింది. పెద్ది పహిల్వాన్ గ్లిమ్ప్స్ అంటూ 45 సెకన్ల వీడియో విడుదల చేసింది.  ‘కుస్తీ అంటే బ్యాట్ తో బంతికి ఎదురెళ్లే ఆటకాదురా ప్రాణంతో చావుకు ఎదురెళ్లే ఆట అనే డైలాగ్ కు  ‘’ఆటే నా పొగరు’ అని హీరో చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలిచింది. చరణ్ గద పట్టుకుని దుమ్ముదులిపేశారు. ఆయన సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో థ్రిల్ చేశారు. ఇక ఈ సినిమాను యువ దర్శకుడు బుచ్చిబాబు సాన  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు, బాలీవుడ్ నటుడు తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో వేగంగా కొనసాగుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ రికార్డు స్థాయిలో వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *