ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచుతూ బైక్ యాత్ర… పవన్ ను కలిసిన యువ బైకర్

Spread the love

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో  ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మేరఠ్ కు చెందిన 23 ఏళ్ల యంగ్ బైకర్ తాప్పీ ఉపాధ్యాయ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఒబేసిటీ ముక్త్ భారత్ – మిషన్ హెల్తీ భారత్ పేరిట ఆమె చేపట్టిన బైక్ యాత్ర వివరాలను పవన్ కు వివరించారు. ఆరోగ్యంపై అవగాహన పెంచుతూ ప్రజల్లో చైతన్యం నింపేందుకు మార్చి 9, 2025న మేరఠ్ లో బైక్ యాత్ర ప్రారంభించినట్లు తాప్పీ ఉపాధ్యాయ పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు 17,400 కిలోమీటర్ల ప్రయాణించి, 500పైగా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.  ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో యాత్ర విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన 12 రాష్ట్రాల్లో కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు.  దేశవ్యాప్తంగా బుల్లెట్ పై ఒంటరిగా ప్రయాణిస్తూ ప్రజారోగ్యంపై అవగాహన కల్పిస్తున్న  తాప్సీ  ఉపాధ్యాయను ఈ సందర్భంగా పవన్ సత్కరించారు. ఆమె యాత్ర చాలా మంది యువతకు స్ఫూర్తిగా నిలవాలని అభిలషించారు. మిషన్ హెల్తీ భారత్ లక్ష్యంతో ఆమె చేపట్టిన సాహసోపేత యాత్ర విజయవంతం కావాలని పవన్ ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *