రిటైర్మెంట్ ప్రకటించిన భారత హాకీ ఆటగాడు గుర్జంత్ సింగ్

Spread the love

భారత హాకీ ఆటగాడు గుర్జంత్ సింగ్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు.రెండు సార్లు ఒలింపిక్ మెడల్ గెలిచిన టీమ్ లో అతను సభ్యుడిగా ఉన్నాడు. గతేడాది వెన్ను గాయంతో టీమ్ కు దూరమైన అతడు తిరిగి చోటు దక్కించుకోలేకపోయాడు. 2017లో అరంగ్రేటం చేశాడు. 130 ఇంటెర్నేషల్ మ్యాచ్ లలో 33 గోల్స్ చేశాడు. 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో గోల్డ్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.2020 టోక్యో ఒలింపిక్స్, 2024 పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాలు సాధించిన టీమ్ లో సభ్యుడుగా ఉన్నాడు. గత సంవత్సరం జూన్ లో జరిగిన ప్రో హాకీ లీగ్ తర్వాత వెన్ను గాయంతో ఆటకు దూరమయ్యాను పునరాగమనం చేసి హాకీ ఇండియా లీగ్ లో ఆడినా సీనియర్ టీమ్ లోకి రాలేకపోయాను. అందుకే హాకీకి వీడ్కోలు  చెప్పేందుకు ఇదే సరైన సమయమని భావించినట్లు గుర్జంత్ తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *