భారీ నష్టాలతో ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు..!

Spread the love

గత రెండు రోజుల భారీ లాభాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ ను భారీ నష్టాలతో ముగించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల మన మార్కెట్లపై ప్రభావం చూపింది. ఇక గత రెండు రోజులుగా లాభపడటంతో, ఇన్వెస్టర్లు ఈరోజు ‘ప్రాఫిట్ బుకింగ్’కు ఆసక్తి కనబరిచారు. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ముగియడం కూడా ప్రతికూల ప్రభావం చూపింది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 1,690.23 పాయింట్లు నష్టపోయి 73,583.22 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 486.85 పాయింట్లు  పతనమై 22,819.60 వద్ద ముగిసింది. డాలర్‌ తో పోలిస్తే రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా 94.73గా కొనసాగుతోంది.  ఓఏంజీసీ, టీసీఎస్, విప్రో, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *