ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం రేవంత్ సాయం 

Spread the love

ట్యాంక్ బండ్ పై ఎంతో మంది ప్రాణాలను కాపాడి, ట్యాంక్ బండ్ నే తన ఇంటి పేరుగా గుర్తింపు పొందిన ట్యాంక్ బండ్ శివ కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఉపాధి లేక కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు పడుతున్న శివ పరిస్థితి ఇటీవల సీఎం రేవంత్ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో వారి కుటుంబాన్ని కలిసి  రూ.5 లక్షలు ఆర్థికసాయంతో పాటు శివ కుమారుడు వేణుమాధవ్ కు హోం గార్డు ఉద్యోగ నియామకపత్రం అందజేశారు. ఉపాధి కోసం ట్యాంక్ బండ్ సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని శివ కోరారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తన కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *