15 ఏళ్ల తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు ఇంకా మనతోనే ఉన్నాయి

Spread the love

దాదాపు 28 ఏళ్ల తర్వాత భారత్ మరోసారి వన్డే ప్రపంచకప్ ను 2011 లో సరిగ్గా ఇదే రోజున కైవసం చేసుకుంది. ఆ అద్భుత ఘట్టానికి నేటితో 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఉపఖండం ఆతిథ్యం ఇచ్చిన ఆ ప్రపంచకప్ లో మహేంద్ర సింగ్ నేతృత్వంలోని భారత్ అసమాన పోరాటం ప్రదర్శించిన భారత్ ఫైనల్ లో శ్రీలంకపై గెలిచి రెండోసారి ఆ ఫార్మాట్ లో విశ్వవిజేతగా నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, ఆశీష్ నెహ్రా, రవిచంద్రన్ అశ్విన్, పీయూష్ చావ్లా, శ్రీశాంత్ లు ఆ వరల్డ్ కప్ గెలిచిన టీమ్ లో ఉన్నారు. కోట్లాది అభిమానుల చిరకాల స్వప్నాన్ని నిజం చేశారు. ఇక ఈ జ్ఞాపకానికి 15 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ భావోద్వేగ పోస్ట్ చేశారు. మొదటి బంతి ఎప్పుడూ గుండె వేగాన్ని పెంచుతుంది… కానీ ఆ రాత్రి, ఆ వేగం అస్సలు తగ్గలేదు.15 ఏళ్ల తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు ఇంకా మనతోనే ఉన్నాయి. మనమంతా ఒకే కల కోసం ఏకమైన యువ క్రికెటర్లము. అది భారతదేశం కోసం ప్రపంచకప్‌ను గెలవాలనే కల.ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ, మరియు అభిమానులందరికీ… దీనిని మాతో పంచుకున్నందుకు మరియు ఇంత ప్రత్యేకంగా మార్చినందుకు ధన్యవాదాలు. జై హింద్! అంటూ సచిన్ పోస్ట్ చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *