వైవిధ్యమైన కథాంశాలున్న చిత్రాలను ఎంచుకుంటూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు సాయి ధరమ్ తేజ్. తాజాగా ఆయన తన 19వ చిత్రాన్ని అధికారికంగా నేడు ప్రకటించారు. విరూపాక్ష వంటి సినిమాతో హిట్ అందుకున్న ఆయన మరోసారి డిఫెరెంట్ స్టోరీతో అలరించనున్నాడు. #SDT19 అనే వర్కింగ్ టైటిల్‌తో రానున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్ర బృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. ప్రేక్షకుల్లో ఆసక్తిరేకెత్తించే విధంగా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. యుగయుగాల రహస్యాలు… ఊహకందని మహా శక్తుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ లో ‘యుగాల నాటి రహస్యాలు.. ఊహకు అందని అపరిమితమైన శక్తి’ అనే క్యాప్షన్ జోడించడంతో మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘క’ చిత్రంతో విజయం సాధించిన యువ దర్శకులు సుజిత్, సందీప్ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాతో సాయి తేజ్ నిర్మాతగా కూడా మారుతున్నారు. తన తల్లి పేరు మీద ‘విజయదుర్గ ప్రొడక్షన్స్’ అనే బ్యానర్ ను ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.