జనసేనాని ఉక్కు సంకల్పానికి నిదర్శనం ఏపీ శాశ్వత రాజధాని అమరావతి

Spread the love

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పదవిలో లేనప్పటి నుండి పోరాడిన నేతల్లో ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రముఖంగా ఉన్నారు.  తొలిరోజు నుండి అమరావతి చట్టబద్ధత కోసం, భవిష్యత్తులో ప్రభుత్వాలు రాజధాని మార్చకుండా పార్లమెంట్ లో ఆమోదం పొందేలా చేయాలని గళమెత్తారు.2019–2024 కాలంలో రాష్ట్ర రాజధాని అంశంపై తీవ్ర గందరగోళం నెలకొని, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రోడ్డెక్కిన పరిస్థితుల్లో, అమరావతిని ఎవరూ మార్చలేరు అని శపథం చేసి, అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలకు, పెట్టుబడిదారులకు భరోసా కల్పించిన సందర్భాన్ని జనసేన మరోసారి గుర్తుచేసింది. ఈ మేరకు ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా జనసేన పోస్ట్ చేసింది. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు కూటమి ఏర్పాటు చేసి, ప్రజలకు ధైర్యాన్ని నింపి, నేడు పార్లమెంట్‌లో అమరావతిని రాజధానిగా ఆమోదం పొందేలా చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొంది. ఇచ్చిన మాట కోసం రాజకీయంగా తాను తగ్గి… ప్రజలను గెలిపించి, నిజమైన నాయకత్వానికి నిదర్శనంగా నిలిచారని జనసేనాని ఉక్కు సంకల్పానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి అని పేర్కొంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *