విమర్శలు, వ్యాఖ్యానాలపై స్పందించడంలో ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. న్యాయస్థానాల్లోనూ పోరాడవచ్చని . దాడులే సమాధానం కాదని స్పష్టం చేసింది. వైసీపీ చేసిన, చేస్తున్న దిగజారుడు వ్యాఖ్యలకు కూటమి పార్టీలు ఏం చేయాలి? డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ పై వైసీపీ అధ్యక్షుడే హద్దులు దాటి వ్యాఖ్యలు చేసిన సందర్భాన్ని గుర్తుచేసింది. ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి నడతను…. మాటలను జెన్-జి గమనిస్తోంది… మరచిపోవద్దని సూచించింది. ప్రజాస్వామ్య రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యాఖ్యానాలు ఉంటాయి. వాటిపై స్పందించడంలోను ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలని తెలిపింది. విమర్శలను స్వీకరించలేక దాడులకు తెగబడటాన్ని ఎవరూ హర్షించరు. విమర్శలకు దాడులు సమాధానం కావు. విమర్శలు, ఆరోపణలు, వ్యాఖ్యానాలపై చట్టబద్ధంగా న్యాయస్థానాల్లో పోరాడే అవకాశాన్ని మన రాజ్యాంగం కల్పించిందని తెలిపింది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ, అధికారంలో ఉన్నప్పుడూ, ప్రతిపక్ష హోదా కూడా సాధించలేని స్థితిలో కూడా చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతనాన్ని చూపిస్తున్నాయని పేర్కొంది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి పాఠశాల విద్యార్ధుల సమక్షంలోనే హద్దులు దాటి, దిగజారుడు మాటలు మాట్లాడారని గుర్తు చేసింది. అప్పుడు డిప్యూటీ సీఎం పవన్ పైన వ్యక్తిత్వ హననానికి పాల్పడి ఆయన కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు ఎంత నీచమైనవో ప్రజలందరికీ తెలుసని పేర్కొంది. అయితే అప్పుడు జగన్ కార్యాలయాలపై గానీ, ఆయనకు చెందిన సంస్థలపైగానీ జనసేనగానీ, పవన్ కళ్యాణ్ అభిమానులుగానీ దాడికి తెగబడ్డారా? అని ప్రశ్నించింది. పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలో పార్టీ నాయకులకు, శ్రేణులకు ఎదుటివారు దిగజారి మాట్లాడినా, మనం వారి స్థాయికి దిగజారవద్దని పవన్ శ్రేణులకు స్పష్టంగా చెప్పేవారని పేర్కొంది.