ఏంటి ఇది నిజామా??? తను అనిల్ రావిపూడి మేనకోడలా???

Spread the love

అనిల్ రావిపూడి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుసగా విజయవంతమైన చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో ఆయన మరో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆయన సినిమాల గురించి అందరికీ తెలిసినా, అనిల్ రావిపూడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు మాత్రం చాలా మందికి తెలియవు. ఇటీవల ఓ సందర్భంలో ఆయన తన కుటుంబానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఒక యువ హీరోయిన్ తనకు బంధువుల అమ్మాయి అవుతుందని చెప్పారు. ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకున్నప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమె ప్రస్తుతం యువతలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్. ఆమె మరెవరో కాదు ప్రస్తుతం అగ్రనటులందరితో నటిస్తూ అలరిస్తున్న శ్రీలీల.  అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటించింది. ఆ సినిమాలో ఆమె బాలయ్యకు  కుమార్తె వంటి పాత్రలో కనిపించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటించింది. సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్లలో పాల్గొన్న అనిల్ రావిపూడి, శ్రీలీలతో తనకు ఉన్న చుట్టరికాన్ని అప్పుడే వెల్లడించారు. ఆ విషయం వినగానే అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. ఐతే ఇప్పుడు ఈ టాపిక్ వైరల్ గా స్ప్రెడ్ అవుతుంది. శ్రీలీల అసలు సొంత రాష్ట్రం కర్ణాటక. ఆమె చిన్నతనం ఎక్కువగా బెంగళూరులో గడిచింది. తర్వాత ఆమె చదువుల కోసం అమెరికా కూడా వెళ్లింది. అయినప్పటికీ ఆమె కుటుంబానికి ఆంధ్రప్రదేశ్‌తో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా ఒంగోలు దగ్గరలో ఉన్న పొంగులూరు గ్రామం వారి కుటుంబానికి చాలా దగ్గరైన ప్రదేశం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అనిల్ రావిపూడి స్వగ్రామం కూడా అదే ప్రాంతం. శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణ పొంగులూరుకు చెందినవారే. అనిల్ రావిపూడికి ఆమె స్వయంగా కజిన్ సిస్టర్ అవుతారు. అంటే శ్రీలీల అనిల్ రావిపూడికి మేనకోడలు. భగవంత్ కేసరి షూటింగ్ సమయంలో కూడా శ్రీలీల చాలా ప్రొఫెషనల్‌గా ప్రవర్తించేదట. అందరి ముందూ అనిల్ రావిపూడిని “డైరెక్టర్ గారు” అని గౌరవంగా పిలిచేదట. అయితే సెట్స్‌లో ఎవరూ లేని సమయంలో మాత్రం ఆమె సరదాగా “మామయ్య” అని పిలుస్తూ ఆటపట్టించేదట. ఆ విషయం గురించి అనిల్ రావిపూడి కూడా నవ్వుతూ చెప్పిన సందర్భం ఉంది. ఆ మాట వినగానే అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు దర్శకుడు, మరోవైపు హీరోయిన్‌గా ఉన్నా… చుట్టరికం మాత్రం అలాగే కొనసాగుతుండటం అందరినీ ఆకట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *