101 మిలియన్స్ వ్యూస్ దాటేసిన ‘ఆయా షేర్’

Spread the love

నేచురల్ స్టార్ నాని  హీరోగా తెరకెక్కుతున్న The Paradise సినిమాలో ఇటీవల విడుదలైన  “ఆయా షేర్…” పాట భారీ వ్యూస్ దాటేసి సంచలనం సృష్టిస్తోంది.  ఈ పాట విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ముఖ్యంగా యువతలో ఈ పాటకు భారీ స్పందన లభిస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ పాట వల్ల సినిమా మీద ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి. తాజాగా ఈ పాట వ్యూస్ లో రికార్డు సృష్టించింది. 101 మిలియన్స్ వ్యూస్ ను దాటేసింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ తెలిపింది. ఈ సందర్భంగా ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో జడల్ గా నాని కనిపించనున్నారు. కయాడు లోహర్, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయెల్,  మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఆగష్టు 21న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *