పెద్దలు చెప్పిన ఆహార సూత్రాలు పాటిద్దామా..!

Spread the love
  • సరైన సమయంలో తినాలి. ఎక్కువగా పండ్లు, తాజా కూరగాయలు తీసుకోవాలి. చిరుతిండ్లు వద్దు.
  • ఆకలి వేసినప్పుడే భోజనం చేయాలి. అలాగనీ తంతుగా, ఏదో మొక్కుబడిగా తినవద్దు.
  • ఆహారాన్ని దుర్వినియోగం చేయొద్దు. అవసరమైన మేరకే తినాలి. అదనపు ఆహారాన్ని పొట్టలోకి పంపొద్దు.
  • వారంలో ఒక్కరోజైనా తప్పనిసరిగా ఉపవాసం ఉండాలనే నియమాన్ని ఆచరించడం మంచిది.
  • డైటింగ్‌ను పాటించాలనుకుంటే పౌష్టికాహార నిపుణుడ్ని లేదా వైద్యుడిని సంప్రదించాలి.
  • ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని అర లీటరు నీళ్లు లేదా నిమ్మరసం కలిపిన నీటిని తాగాలి.
  • భోజనం సమయంలో మీ ఆలోచలనలన్నీ తినటంపైనే కేంద్రీకరించాలి.
  • రోజూ భోజనం పూర్తయ్యాక కనీసం ఒక ఫ్రూట్ తినటానికి ప్రయత్నించాలి.
  • పడుకునే సమయానికి కనీసం రెండు గంటల ముందే భోజనం ముగించాలి.
  • తినే సమయంలో మీ ఒత్తిళ్లను, విచారాలను దూరంగా పెట్టాలి. అవి తిండిపైన ఎఫెక్ట్ చూపకూడదు.
  • రాత్రి సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి.