ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజి 1 మహిళల కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ, ప్రగతి, మధురలతో కూడిన టీమ్ ఫైనల్ కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్ భారత జట్టు 233-230పై టర్కీ పై విజయం సాధించింది. అంతకు ముందు క్వార్టర్ ఫైనల్ లో డెన్మార్క్ పై 235-234తో విజయం సాధించింది. వ్యక్తిగత విభాగంలో స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖ రెండో రౌండ్ చేరింది. మొదటి రౌండ్ లో ఆమెకు బై లభించింది. ప్రగతి, మధుర సైతం మొదటి రౌండ్ దాటారు. ప్రగతికి బై లభించింది. మధుర 143-141తో బ్రిటన్ కు చెందిన గ్రేస్ పై గెలిచింది. మరోవైపు మొదటి రౌండ్ లో అదితి ఎల్ సాల్వెడార్ కు చెందిన సోఫియా రియాజ్ పై గెలుపొందింది.