చక్కనైన ముఖాకృతి కోసం మేకప్ టిప్స్..!

Spread the love

చక్కని ఫేషియల్ లుక్ కోసం.. గుడ్ లుకింగ్ ఫేస్ అప్పీరింగ్ కోసం అమ్మాయిలు ఎన్నో మేకప్ ట్రిక్స్, బ్యూటీ సెలూన్ లను ఫాలో అవుతుంటారు. అయితే మఖం చక్కని ఆకృతిలో కనిపించేందుకు వేసే మేకప్ ను ఫాషన్ పరిభాషలో కాంటూరింగ్ గా పిలుస్తారు. కాంటూరింగ్ అనేది అందరికీ సాధ్యం కాదు. మేకప్ వేయడంలో దేన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి? ముఖం మీద ఎక్కడ ఎలాంటి షేడ్ వాడాలి? ఎక్కడ ముఖ చర్మాన్ని సమర్థవంతంగా కవర్ చేయాలి? అనే విషయాలు ముందుగా తెలిసి ఉండాలి. ఈ ట్రిక్స్ తెలియకపోతే ఎంత ఖరీదైన మేకప్ సామాగ్రి ఉన్నా.. సరిగా చేసుకోకపోతే అది వ్యర్థమే అవుతుంది.
మరీ ముఖ్యంగా బొటాక్స్ లిఫ్ట్ షేప్ అనేది చాలామంది కోరుకుంటున్నారు.. మేకప్ వేయడంలో ఎంతో పట్టు ఉంటే తప్ప దాన్ని సరిగా వేయలేరు. అలాంటిది ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం..

బొటాక్స్ లిఫ్ట్ షేప్ లుక్ ఫేస్..
ముందుగా టేప్ ముక్కని ముఖం మీద నిర్ణీత ప్రాంతంలో అతికించి మేకప్ వేయడం ద్వారా చక్కని ఆకృతి తీసుకురాగలుగుతారు. బొటాక్స్ లిఫ్ట్ షేప్ కోసం మొదట టేప్ ను తీసుకోవాలి. ఈ టేప్ ను కుడివైపు చెవి దగ్గర మొదలుపెట్టి దాన్ని క్రాస్ గా తీసుకుని పెదవుల మూలల మీదుగా అంటే టేప్ కాస్త పెదవుల లోపలికి వెళ్ళాలి. ఇలా కొనసాగించి దాన్ని మళ్ళీ ఎడమ చెవి వైపుకు తీసుకెళ్లాలి. ఇలా చేయడం వల్ల టేప్ ఎడమ చెవి నుంచి కుడి చెవి వరకు V షేప్ లో పరచుకుంటుంది. ఇవి రెండు వైపులా ఓకేవిధంగా ఉండేలా చూసుకోవాలి. ఏ వైపు అయిన కాస్త వంకరగా ఉందంటే మేకప్ తరువాత షేప్ కూడా వంకరగా కనిపించే అవకాశం ఉంటుంది.
కాబట్టి టేప్ ను సరిగ్గా సెట్ చేసిన తరువాత చెంపల మీద కాంటూర్ క్రీమ్ ను అప్లై చేయాలి. ఇలా అప్లై చేసేటప్పుడు ఆ క్రీమ్ పొరపాటున కూడా టేప్ కిందుగా వెళ్లకుండా జాగ్రత్త పడాలి. కాంటూర్ క్రీమ్ అప్లై చేసుకున్న తరువాత టేప్ ను మెల్లగా తీసేయాలి. రివర్స్ లో మేకప్ వేయాలి. సాధారణంగా ఉపయోగించే బ్లష్, పౌడర్, హైలెట్ మొదలైనవాటిని ఉపయోగించవచ్చు.

ఈ కాంటూరింగ్ మేకప్ వేసేటప్పుడు ముఖం మీద టేప్ అప్లై చేయడానికి రెండు రకాల టిప్స్ వాడచ్చు. ఒకటి కుడి చెవి నుంచి ఎడమ చెవి వరకు నోటి భాగంలోకి టేప్ ను అతికించడం. టేప్ నోట్లోకి వెళ్లడం ఇష్టం లేనివారు అదే టేప్ ను చెవి నుంచి పెదవి మూలల వరకు ఒకటిగా.. ఆ తరువాత రెండవ భాగం వైపు కూడా అలాగే రెండవ ముక్కను అతికించవచ్చు. ఈ టేప్ జిగురు చర్మానికి ఇబ్బంది పెట్టకుండా మాయిశ్చరైజర్ ను రాసుకుంటే మేలు!