మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు నివాళులర్పించారు.
ఏపీ సీఎం చంద్రబాబు:
మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. సామాజిక విప్లవ పితామహుడు పూలే. కుల వివక్షకు వ్యతిరేకంగా, అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం కృషి చేసిన ఆ మహనీయుడు మనకు ఎప్పటికీ ఆదర్శం. ఆయన చూపించిన బాటలో నడవడం మన సామాజిక బాధ్యత. “విద్య లేనివాడు వివేకాన్ని కోల్పోతాడు, వివేకం లేనివాడు నైతికతను కోల్పోతాడు, నైతికత లేనివాడు అభివృద్ధిని కోల్పోతాడు” అని ఆయన చేసిన బోధనలు ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
మంత్రి నారా లోకేష్:
ప్రముఖ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. దళితుల అభ్యున్నతి, అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు ఆయన జీవితాంతం కృషిచేశారు. విద్య ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేశారు. ఆయన జయంతిని ప్రజాప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. సామాజిక సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధనకు అందరం కృషిచేద్దాం.