కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర 

Spread the love

ఐపీఎల్ సీజన్ 19లో రాజస్థాన్ రాయల్స్ జోరు కొనసాగుతోంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించి సీజన్ లో వరుసగా 4వ విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గువాహటి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201పరుగులు చేసింది. రజత్ పటేదార్ 63 (40; 4×4, 4×6) హాఫ్ సెంచరీతో ఆ టీమ్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 32 (16; 7×4), వెంకటేష్ అయ్యర్ 29 నాటౌట్ (15; 1×4, 2×6), రోమారియో షెపర్డ్ 22 (11; 2×4, 1×6) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ 2 వికెట్లు చొప్పున, సందీప్ శర్మ, రవీంద్ర జడేజా 1 వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ కు మంచి ఆరంభం లభించింది. ఆ టీమ్ పవర్ ప్లే ఓవర్లలోనే 90 పై చిలుకు పరుగులు చేసి సత్తా చాటింది. వైభవ్ సూర్యవంశీ 78 (26; 8×4, 7×6), ధ్రువ్ జురెల్ 81 నాటౌట్ (43; 8×4, 3×6) విధ్వంసకర ఇన్నింగ్స్ లతో చెలరేగారు. రవీంద్ర జడేజా 24 నాటౌట్ పర్వాలేదనిపించాడు. ఇక బెంగళూరు బౌలర్లలో హేజల్ వుడ్, కృనాల్ పాండ్య 2 వికెట్లు చొప్పున పడగొట్టారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *