మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘భరతవర్ష ‘saga of shula’. ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. గోపీచంద్ కెరీర్లో ఇది 33వ సినిమా కావడం కూడా ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది. చాలా కాలంగా ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్, ఈ సినిమాతో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని అందించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని టాలెంటెడ్ దర్శకుడుసంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ‘ఘాజీ’, ‘అంతరిక్షం’ వంటి విభిన్నమైన కథలతో తనదైన శైలిని చూపించిన సంకల్ప్ రెడ్డి, ఇప్పుడు ఒక హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ కథను చెప్పడానికి సిద్ధమయ్యారు. అందుకే ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా రీతూ వర్మ నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెమరింత పెంచేసింది. కేవలం 55 సెకన్ల పాటు ఉన్న ఈ గ్లింప్స్ ప్రేక్షకులను ఒక సరి కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోయిన అనుభూతి కలిగింది. ముఖ్యంగా 642 ఏడి కాలానికి చెందిన శూల రాజ్యాన్ని చూపించిన విధానం చాలా ఆకట్టుకుంది. గోపీచంద్ మేకోవర్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ అన్ని కలిసి ఈ పాత్ర హైలెట్ గా నిలుస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ‘భరతవర్ష’ అనే టైటిల్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది మన భారతదేశానికి పురాతన కాలంలో ఉన్న పేరు. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ అందించిన నేపథ్య సంగీతం కూడా గ్లింప్స్‌కి హైలెట్ గా నిలిచింది. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని అందించబోతుందని తెలుస్తోంది.