నేటి ట్రేడింగ్ లో భారీ లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్ల జోరు

Spread the love

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్ లో భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం మరియు భౌగోళిక ఉద్రిక్తతలు కొంత సడలడం వంటి సానుకూల అంశాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు. దీంతో సూచీలు లాభాల బాట పట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ సుమారు 1263 పాయింట్లు లాభపడి 78,111 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 388 పాయింట్ల లాభంతో 24,231 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.93.40గా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌ కు 95 డాలర్ల దిగువకు చేరడం భారత్ వంటి దిగుమతి దేశాలకు కలిసివచ్చింది. అమెరికా మరియు ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరిగే అవకాశం ఉందన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లు రాణించాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్ లో వృద్ధి మార్కెట్‌ను నడిపించింది. ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మరియు ఆయిల్ & గ్యాస్ రంగాల్లో కూడా మంచి కొనుగోళ్లు కనిపించాయి. ఇండిగో, పవర్ గ్రిడ్, ఎటర్నల్, టీసీఎస్, హిందాల్కో షేర్లు లాభాలతో ముగిశాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *