ఏపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల భేటీ 

Spread the love

సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంటులో ప్రవేశపెడుతోన్న నారీ శక్తి వందన్ చట్ట సవరణ బిల్లుపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. బిల్లు ఆమోదం పొందాక చేపట్టాల్సిన నారీ శక్తి విజయోత్సవాలు, కార్యాచరణపై ఎన్డీఏ పక్ష నేతల సమాలోచనలు చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వాలని కోరుతూ రాష్ట్రంలోని వివిధ పార్టీల అధ్యక్షులకు, ఎంపీలకు ఇప్పటికే సీఎం చంద్రబాబు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *