జోరు కొనసాగిస్తున్న బెంగళూరు.. తాజాగా లక్నోపై 5వికెట్ల తేడాతో విజయం 

Spread the love

ఐపీఎల్ సీజన్ 19లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు ముందు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ 40 (32; 3×4, 2×6), ముకుల్ చౌదరి 39 (28; 3×4, 2×6), ఆయుష్ బడోని 38 (24; 4×4, 1×6) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. నికోలస్ పూరన్ (1), రిషబ్ పంత్ (1), అబ్దుల్ సమద్ (0) ఘోరంగా విఫలమయ్యారు.  బెంగళూరు బౌలర్లలో రసిక్ సలామ్ దార్ 4 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు, కృనాల్ పాండ్య 2 వికెట్లు, జోష్ హాజల్ వుడ్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు 15.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 49 (34; 6×4, 1×6), రజత్ పటేదార్ (27), జితేష్ శర్మ (23) పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు, ఆవేష్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *