శ్రీనివాసమంగాపురం టీజర్..విడుదల చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు

Spread the love

ఘట్టమనేని కుటుంబం నుండి వస్తున్న మరో నట వారసుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. రష తడానీ హీరోయిన్ గా నటిస్తోంది. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. సి.అశ్వనీ దత్ సమర్పణలో చందమామ కథలు పతాకంపై రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ విడుదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు టీజర్ ను విడుదల చేశారు. శ్రీనివాసమంగాపురం  టీజర్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది… చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తోందన్నారు.  జయకృష్ణ అందమైన సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టడం చూడటం గర్వంగా ఉందని మహేష్ పేర్కొన్నారు. అతనికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ప్రతి అడుగులోనూ అతను ఎదుగుతూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఒక ఫ్రెష్ లవ్ స్టోరీగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా నటిస్తున్నారు. వెంకటప్పయ్య నాయుడుగా మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రలో ఇందులో కనిపించనున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *