అధికారంలోకి రాగానే జువ్వలదిన్నె నుండి ప్రైవేటు డిఫెన్స్ కంపెనీని షిఫ్ట్ చేస్తామని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. మత్స్యకారుల పిల్లలకు మెరుగైన వెయ్యికి పైగా ఉద్యోగాలు వస్తాయంటే.. ఆనందించాల్సింది పోయి, అడ్డుకుంటాననడం ముమ్మాటీకీ సైకోయిజమేనని మండిపడ్డారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటారు.ఉద్యోగాలు వస్తాయంటే ఉసూరుమంటూ ఏడుస్తారు..నిలువెల్లా స్వార్థం, మనసంతా విధ్వంసంతో రప్పా రప్పా నరుకుతాం.. అమరావతిని మార్చేస్తాం..కట్టినవన్నీ కూల్చేస్తాం.. కంపెనీలన్నీ వెళ్లగొడతాం.. ఏమిటీ దుర్మార్గ పనులు అని ప్రశ్నించారు. దేశ రక్షణకు అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి, తరిమేస్తానంటారా? ఇదేం రాక్షస మనస్తత్వం? అంటూ లోకేష్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.