ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ..నష్టాలతో ట్రేడింగ్ ముగించిన దేశీయ సూచీలు

Spread the love

మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు శాంతించనున్నాయనే వార్తల మధ్య లాభాలలో ప్రారంభమైనప్పటికీ నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల ఆశలతో మార్కెట్లు ఉదయం జోష్ తో  ప్రారంభమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడింది. అయితే మధ్యాహ్నం తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి  చూపడంతో సూచీలు లాభాల నుండి నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా కీలక రంగాల షేర్లలో అమ్మకాలు మార్కెట్ పై ప్రభావం చూపాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ సుమారు 122 పాయింట్లు లాభపడి 77,988 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 24,196 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.93.28గా కొనసాగుతోంది. ఎటర్నల్, ట్రెంట్, అదానీ పోర్ట్స్, బీ.ఈ.ఎల్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 96 డాలర్లకు పైగా ట్రేడ్ అవుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *