తెలుగులో బంపర్ ఛాన్స్ కొట్టేసిన ధురంధర్ నటుడు..?

Spread the love

గతేడాది చివరిలో విడుదలైన ‘ధురంధర్-1’ సినిమాలో అక్షయ్ ఖన్నా పోషించిన ‘రహ్మాన్ డకాయత్’ పాత్రతో అదరగొట్టి ప్రేక్షకులను విశేషంగా అలరించారు.  ఈ పాత్ర అతనికి కేవలం ప్రశంసలు మాత్రమే కాదు, కొత్త అవకాశాల తలుపులు కూడా తెరిచింది. ఇప్పటివరకు అక్షయ్ ఖన్నా కెరీర్‌లో చాలా డిఫెరెంట్ పాత్రలు చేశారు. కానీ ‘ధురంధర్-1’లోని రహ్మాన్ డకాయత్ పాత్ర ఆయనకు భారీ క్రేజ్ ను తీసుకొచ్చింది. ఈ క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించింది. తాజా ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం అక్షయ్ ఖన్నాకు టాలీవుడ్ నుంచి ఒక భారీ ఆఫర్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఆఫర్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుండి  వచ్చిందని చర్చ జరుగుతోంది. త్రివిక్రమ్ సినిమాలు అంటేనే పదునైన డైలాగ్స్‌, పాత్రల్లో బలం, కథలో కొత్తదనం అన్ని కలిపిన ప్రత్యేకమైన శైలి ఉంటుంది. కేవలం డైలాగ్స్ కోసమే ఆయన సినిమాలు చూసే వారున్నారు.  అలాంటి దర్శకుడు అక్షయ్ ఖన్నా లాంటి వైవిధ్య నటుడితో కలిసి పనిచేస్తే ప్రేక్షకులకు ఒక మంచి వినోదాన్ని అందించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ చేతిలో రెండు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమా. ఇది ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం అక్షయ్ ఖన్నాను పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరో వైపు… త్రివిక్రమ్ మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. అది జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఉండే మైథలాజికల్ కథ. ఈ సినిమా గురించి ఇప్పటినుంచే భారీ అంచనాలు ఉన్నాయి. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో త్రివిక్రమ్ స్టైల్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఒక పవర్‌ఫుల్ విలన్ లేదా కీలక పాత్ర కోసం అక్షయ్ ఖన్నా పేరు వినిపిస్తోంది. అయితే… ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏదో ఒకదాంట్లో అక్షయ్ ఖన్నా నటిస్తారా లేదా అన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీనిపై స్పష్టత వస్తే అంచనాలు మరింత పెరుగుతాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *