వారణాసి లో స్పెషల్ సాంగ్…!

Spread the love

సూపర్ స్టార్ మహేశ్ బాబు  దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళిల సినిమా ‘వారణాసి’ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది కేవలం ఒక సినిమా కాదు… ఒక భారీ విజన్, కేవలం  పాన్ ఇండియా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ప్రాజెక్ట్‌గా చెప్పుకోవచ్చు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తుండగా, రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్ కార్తికేయ కూడా నిర్మాణ బాధ్యతల్లో భాగస్వామిగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక సాంకేతికతతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవల కొన్ని రోజులుగా నగరంలోని ప్రత్యేక లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక తాజాగా మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన ఓ భారీ సెట్‌లో ఒక ప్రత్యేకమైన పాటను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ సెట్ కోసం భారీగా ఖర్చు పెట్టి, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ అందిస్తున్నారని తెలుస్తోంది. మహేశ్ బాబు తన కెరీర్‌లో ఎప్పుడూ కనిపించని కొత్త స్టెప్పులతో, కొత్త స్టైల్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

ఈ పాట చిత్రీకరణ పూర్తయిన తర్వాత చిత్ర బృందం కొంతకాలం విరామం తీసుకోనుందని సమాచారం. ముఖ్యంగా మే నెల మొత్తం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి, జూన్ నెలలో తిరిగి షూట్ ప్రారంభించాలనే ప్లాన్ ఉందట. ఈ విరామ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్‌కు సంబంధించిన కొన్ని పనులు, అలాగే తదుపరి షెడ్యూల్ ప్లానింగ్ జరుగుతుందని తెలుస్తోంది. రాజమౌళి తన సినిమాల్లో ఎప్పుడూ ఒక గొప్ప కథను, గొప్ప భావాన్ని ప్రేక్షకులకు ప్రెజెంట్ చేస్తాడు. ఈసారి కూడా అదే మ్యాజిక్‌ను మరింత పెద్ద స్థాయిలో చూపించబోతున్నాడని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రతి విభాగంలోనూ అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *